చలం, ఈ పేరు వినగానే గుర్తొచ్చేది "మైదానం". విప్లవ రచనలు చేసిన వారు ఎందరు ఉన్నా, స్త్రీవాదం అనగానే స్ఫురించేది గురజాడ, కందుకూరి, చలం. స్త్రీవాదం లో చలానిదొక ప్రత్యేక శైలి. మిగతా వారు సమాజం లో ఉన్న దురాచారలను దుయ్యబట్టినా, కుటుంబ, సమాజ నియమోల్లంఘన కావించక, ఆడది తన కష్టాల నుండి వేరొకరి సహయం తో ఎలా బయట పడిందో సున్నితంగా, వ్యంగ్యంగా చెప్పటం చేశారు. అయితే చలం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా మైదానం లో రాజేశ్వరి పాత్రను చిత్రీకరించారు.
రాజేశ్వరిది ప్రేమరాహిత్యాన్ని అనుభవించే పాత్ర. భర్త దగ్గర తాను పొందలేని ప్రేమను వేరొకరి దగ్గర వెతుక్కుంటూ, సమాజపు కట్టుబాట్లను ఎదిరిస్తుంది రాజేశ్వరి. బుద్ధిని ఉపయోగించక, కేవలం మనసు మాట వింటూ, తాను తీసుకున్న నిర్ణయాలకు ఎలా బలయి పోయిందన్నది కధాంశం. స్త్రీవాదం కంటే కూడా నాకు ఈ నవల లో విచ్చలవిడితనం, నియమోల్లంఘన అధికంగా స్ఫురించాయి. కథ లో అంతర్లీనంగా కట్టుబాట్లను కాదంటే ఎదురయ్యే కష్టాల గురించి ఉన్నా, రాజేశ్వరి మానసిక సంఘర్షణను అద్భుతంగా వర్ణించినా, పాఠకుల ద్రుష్టి ఆ అంశం పైన పడటం కష్టం. రాజేశ్వరి భర్తను విడిచి పెట్టి పరాయి వాడితో వెళ్ళిపోవడం, తరువాత అతడు ఆమెని అవసరాలకు వాడుకొని వదిలేయడం, ఈ క్రమంలో ఇంకో మగాడు పరిచయమవటం.... ఇలా రాజేశ్వరి జీవిత పయనం గమ్యం లేనిదై, కోరుకున్న ప్రేమ దొరకక, హత్యా కాండ లో అంతమై, చివరికి న్యాయస్థానం లో నిలబడుతుంది. ఖచ్చితంగా ఈ కథ లో , నియమోల్లంఘన వల్ల వచ్చే నష్టాల కన్నా కూడా బరితెగించడం అన్న అంశం మీదనే పాఠకుల ద్రుష్టి పోతుంది. ఈ రచన ద్వారా చలం సమాజానికి ఏం చెప్పదలచుకున్నదీ నాకైతే అర్ధం కాలేదు!!!
4 కామెంట్‌లు:
ఆ పుస్తకం నేను కూడ చదివాను.
అయితే చలం గారు సమాజం లో చాలా సహజంగా, తరచుగా, రహస్యంగా జరుగుతున్న విషయాన్ని ధైర్యంగా బయటపెటారు అనే అనాలి . నీతి నియమాలు వున్న వారికి ముఖ్యం గా ఆడవారికి జీర్నించుకోవడం కష్టం అయినప్పటికి మన సమాజం లో ఇలాంటి వారు(రాజేశ్వరి) కుడా వున్నారన్నది నిజం.
అయితే ఒక మనిషికి(ఆడ/మగ) కోపం,కామం,ఖ్రొధం, వంటి భావనల మీద కంట్రోల్ లెక పొవడం వల్ల, వాటిని తాత్కాలికంగా పొందే/అనుభవించే మనస్తత్వం వున్నవారు, వాటి కోసం దిగజారడం మొదలుపెడితే ఎంతటి దుష్పరిణామాలకు దారి తీస్తుందని మనం నేర్చుకోవలి.
అయితే ఈనాటి సమాజానికి నవరసాలూ "కళ"బోసినా, కామం మాత్రమే వారిని ప్రభావితం చేస్తుంది,ఆనంద పెడ్తుంది.....! కనుక మనమైనా ఏమి చేస్తాం...?
సమాజం లో లేనిది వ్రాశారని నా ఉద్దేశం కాదు. సామజిక చైతన్యం తీసుకొచ్చిన రచయితగా చలాన్ని పేరుకొనడం నాకు తెలుసు, మరి ఆ స్థాయిలో మైదానం ఖచ్చితంగా లేదు!
i love that bokk but dont have that ihave another two books if any one needs contact me
చలం గారి ఒక్క నవల చదివి ..సామాజిక చైతన్యం కనబడలేదు అంటే ఎలా ???
కామెంట్‌ను పోస్ట్ చేయండి