అనుచరులు

18.3.12

1892వ సంవత్సరపు కోలవెరి!


చాలా రోజుల నుండీ ఈ విషయం బ్లాగుదామంటే వీలు చిక్కటం లేదు. ఈ కింది వాక్యాలను చదవండి:
నీ సైటు నాడి లైటు;నిన్ను మిన్న
కానకున్న
క్వైటు రెచడ్ ప్లైటు .................
మూను లేని నైటు
ఫుల్లుమూను లైటటా,
మూనుకన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటట,
టా!టా!టా!


ఇది గిరీశం మధురవాణి కోసం పాడుకున్న కోలవెర్రి పాట!(కోలవెరి,ఈ మధ్యకాలంలో బాగా ఆదరణ పొందిన పాట. దీని సాహిత్యం ఇక్కడ నేను ప్రస్తావించిన వాక్యాలను చాలా వరకూ పోలి ఉంటుంది.) కన్యాశుల్కం నాటకంలో గురజాడ ఈ పాటను గిరీశం చేత 1892 లోనే పాడించారు. ఆ కాలంలో తెలుగు నాటకానికి జీవం పోసిన గొప్ప సంస్కరణా భావలను వ్యంగ్యం తో నడిపించిన హాస్య రస ప్రధాన నాటకం కన్యాశుల్కం.హాస్యం పండించడానికి గిరీశం ఆంగ్లంలో పలికే సంభాషణలు మహా చతురంగా ఉంటాయి.అలాంటి ఒక సందర్భంలో వచ్చేదే ఈ పాత కోలవెరి! నేను కన్యాశుల్కం బాగా చదివానని ఒప్పుకుంటారుగా!

కామెంట్‌లు లేవు: