భావ వ్యక్తీకరణకు భాషే ఆత్మ.తెలుగు మీద నాకున్న అభిమానమే తెలుగు తీరాలు మొదలు పెట్టించింది. తెలుగు సాహిత్యం, సంగీతం, కవిత్వం, పండుగలు, కథలు, వంటలు, సినిమాలు, తెలుగు వీరులు...ఇలా నాకు తెలిసినవి, నచ్చినవి..ఎన్నో విషయాలను తెలుగు తీరాలకు చేర్చాలని నా ప్రయత్నం.
అనుచరులు
15.1.11
సంక్రాంతి కబుర్లు
శరీర నిర్మాణానికీ, పోషణ కు ఆహారం ఎంత ప్రధానమో, మన మానసిక అరోగ్యానికి కూడా అలాగే ఆహారం ఎంతో ప్రధానమైనది. తినే తిండిని బట్టి మనసు సత్త్వ-రజో-తమో గుణ స్థితులను పొందుతుంటుంది. దీనికి శాస్త్రీయ నిరూపణలు కూడా కలవు. అటువంటి ఆహారం మన చేతికి అంది వచ్చే రోజు ఈ సంక్రాంతి..నా అధ్యాత్మిక ధోరణి ఇక్కడ అప్రస్తుతం...అంటే నే అనదల్చుకున్నది..ధాన్యం వస్తుందనమాట!!! నిజంగా రైతులకు, మనందరికీ పండుగే. ఎంతో ఆనందగా చేసుకునే వేడుక! భోగి మంటలతో చలి కాచుకోవడం, చంటి పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ముగ్గులు, ముఖ్యంగా మన మెలిక ముగ్గులు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు....అబ్బా..ఈ సారి ఈ హడావిడంతా హైదరాబాదు లో ఉండిపోయి తగ్గింది గాని, పరవాలేదు..నిన్న ఒక బొమ్మలకొలువు పేరంటానికి వెళ్ళాను..దానితో సరి పెట్టుకుంటాను. ఇంకా గంగిరెద్దులు-సన్నాయి మేళమైతే ఈ సారి నా చుట్టుపక్కల ఉండే మాటేలేదు. చిన్నప్పుడు ఆవు పేడ తో అలికి, ముగ్గేసి, గొబ్బిళ్ళు పెట్టి....
సుబ్బి గొబ్బెమ్మ..సుబ్బణ్ణివ్వవే...
చామంతి పూవంటీ చెల్లెల్నివ్వవే...
తామర పూవంటీ తమ్ముణ్ణివ్వవే..
మొగలీ పూవంటీ మొగుణ్ణివ్వవే...
హా..హా అంటూ పాడటం ఇంకా కళ్ళల్లోనే ఉంది.. మా దివ్య, లక్ష్మి, రాంపండు, విజ్జి, విస్సు, సుర్యావతి, శసి...వీళ్ళందరూ నా పేరంటాళ్ళు...ఇప్పుడు కొందరైతే చంటి పిల్లల తల్లులు! బహుశా..గొబ్బిళ్ళాడటం పోయి, పిల్లలికి భోగి పళ్ళు పోస్తుంటారు! అయితేనేం చిన్నప్పుడు బాగ చేసుకునే వాళ్ళం ఈ పండుగ. హైదరబాదు వచ్చేవరకూ గాలి పటాలు ఎగరేస్తారని మాత్రం తెలియదు. ఇది కూడా బాగుంది. చిన్నప్పటి బొమ్మలకొలువులు గుర్తుచేసుకుంటూ ఉన్నా....ఇక ఏం బ్లాగినా చాంతాడంతవుతుంది! మర్చిపోయాను..ఈ రోజు తిథుల ప్రకారం స్వామి వివేకానంద జన్మదినం. వారికి నా జోతలు....మీ అందరికీ, మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి