భూలోక భవసాగర దర్శనార్ధం విష్ణు మూర్తుల వారు, నారదుణ్ణి వరాహంగా ఇక్కడికి పంపించారట. వరాహమంటే పంది అనుకునేరు, కాదు..ఖడ్గమ్రుగం! అలా నారదుల వారు భక్తి సాగరం లో మునిగి సంసార సాగరం లో తేలారట! మళ్ళీ విష్ణు భక్తి సాగరం లో తేలాలంటే ఈ సంసార సాగరాన్ని ఈదడం రావాలని ఒప్పందమాయె! ఆ హడావుడి లో, చాలా పొదుపుగా మన నారద వరాహులం గారు ఒక్క 60 మంది పిల్లల్ని కన్నారు. వాళ్ళే మన 60 సంవత్సరాలట.అంటే మనకు 12 నెలలు ఉన్నట్టుగా 60 సంవత్సరాలున్నాయి. మనమే సంవత్సరం లో పుట్టామో సరిగ్గా మన షష్టి పూర్తికి మళ్ళీ అదే సంవత్సరం వస్తుందన్నమాట! ఇంతకూ మన నారద సంతానం పేర్లు చూద్దామా..అదే మన 60 సంవత్సరాల పేర్లనూ...
ఇంకా ఏం బ్లాగాలబ్బా..... ఆ! మా నాన్నా, విశ్వనాధ సత్యనారాయణ గారు, శ్రీ రమక్రిష్ణ పరమహంస గారూ మన్మధ నామ సంవత్సరంలో పుట్టారు. ఒకరి షష్టి పూర్తి ఏట ఒకరు. బాగుంది కదా..అసలు విషయం మరిచిపోయాను..అందరికీ శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను చక్కగా ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర, బొబ్బట్లూ లాగించేశాను, మరి మీరో??
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి