తెలుగు వారికి హాస్య రసాన్ని కొత్తగా ఆయన కథల ద్వారా, సినీమాల ద్వారా, పాత్రలను తీర్చిదిద్దడమే కాక, కొత్త కొత్త పద ప్రయోగాలతో గిలిగింతలు పెడుతూ పరిచయం చేశారు రమణ గారు. అటువంటి హాస్యాన్ని ఆయన కలం తో పండిస్తూనే, వంశవ్రుక్షం వంటి గాఢమైన కధకు మాటలందించారు. వారి కలానికి రెండు వైపులా పదునే. బాపు గారితో రమణ గారి స్నేహం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు, వారి స్నేహానికి ఈ మధ్యనే షష్టిపూర్తి అయ్యింది. ఈ రోజు రమణ గారు ఇక్కడ లేకపోయినా, ఆయన ఎప్పుడూ బుడుగుగానో, గోపాళం గానో, సీగాన పెసూనాంబ గానో మనని నవ్విస్తూనే వుంటారు. రమణ అనే పదానికి అర్ధమే ఆనందం కలిగించువాడు. నిజంగా ముళ్ళపూడి వెంకట రమణ గారు సార్ధక నామధేయులు. ఈ పాటికి పైనున్న దెవుళ్ళకి కూడా చక్కిలి గిలి పెడతున్నారేమో!భావ వ్యక్తీకరణకు భాషే ఆత్మ.తెలుగు మీద నాకున్న అభిమానమే తెలుగు తీరాలు మొదలు పెట్టించింది. తెలుగు సాహిత్యం, సంగీతం, కవిత్వం, పండుగలు, కథలు, వంటలు, సినిమాలు, తెలుగు వీరులు...ఇలా నాకు తెలిసినవి, నచ్చినవి..ఎన్నో విషయాలను తెలుగు తీరాలకు చేర్చాలని నా ప్రయత్నం.
అనుచరులు
24.2.11
మన రమణ
తెలుగు వారికి హాస్య రసాన్ని కొత్తగా ఆయన కథల ద్వారా, సినీమాల ద్వారా, పాత్రలను తీర్చిదిద్దడమే కాక, కొత్త కొత్త పద ప్రయోగాలతో గిలిగింతలు పెడుతూ పరిచయం చేశారు రమణ గారు. అటువంటి హాస్యాన్ని ఆయన కలం తో పండిస్తూనే, వంశవ్రుక్షం వంటి గాఢమైన కధకు మాటలందించారు. వారి కలానికి రెండు వైపులా పదునే. బాపు గారితో రమణ గారి స్నేహం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు, వారి స్నేహానికి ఈ మధ్యనే షష్టిపూర్తి అయ్యింది. ఈ రోజు రమణ గారు ఇక్కడ లేకపోయినా, ఆయన ఎప్పుడూ బుడుగుగానో, గోపాళం గానో, సీగాన పెసూనాంబ గానో మనని నవ్విస్తూనే వుంటారు. రమణ అనే పదానికి అర్ధమే ఆనందం కలిగించువాడు. నిజంగా ముళ్ళపూడి వెంకట రమణ గారు సార్ధక నామధేయులు. ఈ పాటికి పైనున్న దెవుళ్ళకి కూడా చక్కిలి గిలి పెడతున్నారేమో!22.2.11
రామాయణ విషవ్రుక్షం-ఇదే ఒక విషవ్రుక్షం!

రంగనాయకమ్మ రామాయణ విషవ్రుక్షం అని ఒక పుస్తకం వ్రాసి జనం మీదికొదిలింది. కాని ఆమె బాధేంటో నాకైతే అర్ధం అవలేదు. 3 సంపుటాలూ కలిపి ఒకే పుస్తకం లో ఆ మధ్య ఎప్పుడో మళ్ళీ అచ్చేశారెవరో. తనని తాను గొప్ప రచయిత్రి అనుకునే ఈవిడ ఒక్క 85 ఎన్నో కాగితాలు మాత్రమే కలిగిన పీఠిక వ్రాసింది!!!
ఆమె ద్రుష్టిలో రామయణం ఒక విషం, రాముడు అన్న వాడు కపటి ....ఇలా ఇంకేవో అద్భుతమైన గొప్ప ఆలోచనలు ఉన్న ఆదర్శ మూర్తి, రంగనాయకమ్మ. ఇప్పుడు జనమందరూ రాముడు దేవుడంటే ఈవిడకొచ్చిన నష్టమేమిటో??
రాముడన్న వాడు ఉన్నాడా లేడా అన్నది అనవసరం. రాముడంటే మనము కొన్ని సుగుణాలకు ప్రతీక గా భావిస్తున్నము. అంటే ఏక పత్నీవ్రతుడు, సత్యవంతుడు, వీరుడు, ఇలాగనమాట. అంతే తప్ప ఎప్పుడో రాజ్యం చేసిన రాజును ఇన్ని యుగాలైనా గుర్తుంచుకుని బానిసల్లగా, గొర్రెల మందల్లాగా, మన పెద్దలు చెప్పారని పూజించటంలేదే!
సరే, రాముడన్న వాడు వాల్మికి స్రుష్టి అనుకుందాము. అప్పుడైనా ఒక సుగుణ రాశిగా వర్ణించిన ఒక పాత్రను గుర్తుంచుకుని ఆ సుగుణాలను రాముడన్న దేవుని పేరుతో జనం ఆరాధిస్తే తప్పేమిటి? మా సంస్క్రుతం అధ్యాపకులు నాకు రమేతాం ఇతి రామాః అని చెప్పేరు. అంటే ఆనందము కలిగించు వాడు రాముడు. రాముని పాత్ర మరి సర్వ జన రంజకముగా ఉంటుంది. ఆనంద స్వరూపుడే గా భగవంతుడు! అప్పుడు అనందము కలిగించువాడు దేవుడే! అలాగని పక్క వారిని బాధపెట్టి ఆనందించేవాడు దేవుడని విపరీత బుద్ధి ప్రయోగము చేస్తే అది కేవలం పైత్యం! సర్వకాల సర్వావస్థలలో ఎల్లరుకూ మంచి చేస్తూ, సన్మార్గదర్శకముగా ఉంటూ, ఆనంద ప్రదాయికముగా ఉండే లక్షణములను దేవుడన్నారు గానీ, దేవుడంటే ఎక్కడో ఆకశం లో కుర్చుని, సినెమాల్లో చూబించినట్టుండడు! కాబట్టి ఈనాడు మనం రాముడన్న పేరుతో ఆరాధిస్తున్న సుగుణాలు ఖచ్చితం గా దైవీ లక్షణాలు! ఇందులో మరి ఈ రంగనయకమ్మకు వచ్చిన అడ్డమేమిటో. అంటే, అందరూ బహు భార్యలతో కూడీ, జూదమాడుతూ, వ్యసనపరులై, సుగుణాలను దూషిస్తూ ఉంటే సమ సమాజం, నవ సమాజం వచ్చేసినట్టా? అందరూ ఉద్ధరింపబడతారా?
పైగా ఈ పుస్తకం యువతకు ఎంతో అవసరమని ఈవిడ అభిప్రాయం. ఏ విధంగానో? స్వనింద-పరస్తుతి ఎంత హానికరమో, పరనింద-అహంకారం కూడా అంతే హానికరం. వాల్మికిని కావ్య కర్తగా హేళన చేసే ముందు, ఈమె సామర్ధ్యం ఏమిటో తెలుసుకున్నదా? కేవలం ఒక రచన మీద వ్యాఖ్యగా కాక, జనానికి సుగుణాల మీద ఉన్న నమ్మకాన్ని హత్య చేయలన్న ఉద్దేశం గల దారుణమైన రచన ఇది! రామయణాన్ని వక్రీకరించి చూపిస్తే జనంలో వచ్చే మార్పేమిటి?
రాముడే చెడ్డవాడైతే, ఇక ఆయన గుణాల మీద ప్రజలకున్న నమ్మకము పోయి అందరూ, వివేక హీనులై వ్యసనపరులవుతారు! నష్టపోయేది ఎవరు? యావద్భారత దేశము. ప్రపంచ దేశాలన్నీ గొప్పగా తలెత్తి చూసే మన కుటుంబ వ్యవస్థ సర్వ నాశనమైపోతుంది. నిజంగానే రంగనాయకమ్మ విషవ్రుక్షాన్ని నాటింది!! మనందరి నైతిక విలువలనూ చంపిపారేశే విషం కక్కే వ్రుక్షం ఆమె వ్రాసిన ఈ మహాగ్రంధము!!
4.2.11
పురాణం పంచలక్షణం ( విశ్వనాధ సత్యనారాయణ వారి పురాణవైర గ్రంధమాల యొక్క ఉపోద్ఘాతము నుండి గ్రహింపబడినది)
"పురాణవైరగ్రంధ మాల" ఈ పేరు వినగానే పురాణములకు విరుద్ధమని అర్ధమవుతుంది గాని ఇందులో ఎముంటుందోనన్న ఉత్సుకత కూడా కలుగుతుంది. చదవాలని నిర్ణయించుకున్నాక, విశ్వనాధ వారి సంపూర్ణ నవలా సాహిత్యం (57 పుస్తకాలు) ఒక పెట్టి రూపం లో విడుదలైనవని తెలిసి వెంటనే తెచ్చుకున్నాము. ఈ పురాణవైరగ్రంధ మాల లో మొత్తం 12 నవలలు ఉన్నవి. వీటి పీఠిక, ఉపోద్ఘాతం చదివాకా ఈ నవలలను తప్పక చదవాలనిపించింది. ఈ పేరు అర్ధం తెలుసుకోవాలంటే తప్పక ఉపోద్ఘాతం చదవాలి.
ఉపోద్ఘాతం (కొంత భాగం మాత్రమే)
మనకు వేదశాస్త్ర పురాణేతిహాసములు కలవు. వానిలో పురాణమున్నది. పురాణమనగా నేమి? "పురాణం పంచలక్షణం " అని మనవారన్నారు. పురాణమైదు లక్షణములు కలది. సర్గము, ప్రతిసర్గము, మన్వంతరములు, రాజవంశములు, అనువంశములు- అను నీ అయిదు లక్షణములు పురాణముల యందుండును. సర్గమనగా స్రుష్టి లక్షణము. మహాప్రళయము తరువాత తొలి సారి స్రుష్టి యొక్క స్వరూపమెట్లుండునో అది సర్గము. తరువాత కొన్ని కొని ప్రళయములు జరుగును. అప్పుడు మరల స్రుష్టి జరుగును. దాని పేరు ప్రతిసర్గము. మూడవది మన్వంతరములు. క్రుత త్రేతా ద్వాపర కలి యుగములు నాల్గూ కలిపినచో ఒక మహాయుగము. ఇట్టి మహయుగములు 71 జరిగినచో , ఒక మన్వంతరము. అట్టి 14 మన్వంతరములు జరిగినచో అప్పుడు మహప్రళయము వచ్చును. ఈ లెక్క ఎక్కడ? పాశ్చాత్యులు మనకు నేర్పెడి చరిత్రలోని లెక్క ఎక్కడ? అల్పమైన ఊహ గలవారి మార్గమును మనమనుసరించుచున్నాము. నాల్గవది రాజవంశము. స్రుష్ట్యాదియందు గల సూర్య చంద్రవంశ రాజుల చరిత్రములు మన పురాణములలో నున్నవి. అనువంశములనగా వారి నుండి కలియుగములో వచ్చిన బహురాజ వంశముల చరిత్రము! అది నేడు చరిత్ర అను పేరున కళాశాలలలో, పాఠశాలలలో చదివింపబడు విషయము. దీనిని పాస్చాత్య చరిత్ర్కారులు పలువిధములుగా మార్చి పాడుచేసి వారి ఇష్టమొచ్చినవి చదివించుచున్నారు. ఇంతకు చెప్పవచ్చినదేమనగా మన పురాణములు చరిత్రయే! మన ఋషులకు చరిత్ర జ్ఞానము లేదనుట, మన పూర్వ నాగరకతను ఎంత తక్కువ పరచినచో వారి యేలుబడి అంత గొప్పగా సాగునని, పాశ్చాత్యులు పన్ని పన్నుగడ!
ఈ రచనాకాలం ఏనాటిదైనా, ఈ రోజుకి కూడా భారతీయులమందరము పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మన మూలాలని విసర్జిస్తున్నాము. మంచి-పురోగమనదాయములు గ్రహించుట నాకు నిరభ్యంతరములు, గానీ స్వనింద-పరస్తుతి వైఖరి విపరీతముగా ప్రబలుతోంది. విశ్వనాధ వారు ఇదే విషయాన్ని చాల చక్కగా పురాణ వైర గ్రంధ మాలలో వాడుకున్నారు. పాశ్చాత్యులు మనకు చెప్పిన తప్పుడు పురాణాలకు ఇది వైరమన్న మాట! ఈ విషయాన్ని సూటి గా ప్రస్తావించక, కధ జరిగిన కాలము, ప్రదేశము వంటి విషయాల్లో చెప్పడం జరిగింది. ఉదాహరణకు జనమేజయుడు అ పక్కనే ఎక్కడో రాజ్యం చేస్తున్నడనీ, భగవద్గీత అను కొత్త గ్రంధం వెలువడిందనీ, పాత్రల చేత చెప్పిస్తూ, భారత యుద్ధం జరిగిందన్న రచయిత నమ్మకాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది. నాకీ అంశం మరి చాలా బాగా నచ్చింది!
ఉపోద్ఘాతం (కొంత భాగం మాత్రమే)
మనకు వేదశాస్త్ర పురాణేతిహాసములు కలవు. వానిలో పురాణమున్నది. పురాణమనగా నేమి? "పురాణం పంచలక్షణం " అని మనవారన్నారు. పురాణమైదు లక్షణములు కలది. సర్గము, ప్రతిసర్గము, మన్వంతరములు, రాజవంశములు, అనువంశములు- అను నీ అయిదు లక్షణములు పురాణముల యందుండును. సర్గమనగా స్రుష్టి లక్షణము. మహాప్రళయము తరువాత తొలి సారి స్రుష్టి యొక్క స్వరూపమెట్లుండునో అది సర్గము. తరువాత కొన్ని కొని ప్రళయములు జరుగును. అప్పుడు మరల స్రుష్టి జరుగును. దాని పేరు ప్రతిసర్గము. మూడవది మన్వంతరములు. క్రుత త్రేతా ద్వాపర కలి యుగములు నాల్గూ కలిపినచో ఒక మహాయుగము. ఇట్టి మహయుగములు 71 జరిగినచో , ఒక మన్వంతరము. అట్టి 14 మన్వంతరములు జరిగినచో అప్పుడు మహప్రళయము వచ్చును. ఈ లెక్క ఎక్కడ? పాశ్చాత్యులు మనకు నేర్పెడి చరిత్రలోని లెక్క ఎక్కడ? అల్పమైన ఊహ గలవారి మార్గమును మనమనుసరించుచున్నాము. నాల్గవది రాజవంశము. స్రుష్ట్యాదియందు గల సూర్య చంద్రవంశ రాజుల చరిత్రములు మన పురాణములలో నున్నవి. అనువంశములనగా వారి నుండి కలియుగములో వచ్చిన బహురాజ వంశముల చరిత్రము! అది నేడు చరిత్ర అను పేరున కళాశాలలలో, పాఠశాలలలో చదివింపబడు విషయము. దీనిని పాస్చాత్య చరిత్ర్కారులు పలువిధములుగా మార్చి పాడుచేసి వారి ఇష్టమొచ్చినవి చదివించుచున్నారు. ఇంతకు చెప్పవచ్చినదేమనగా మన పురాణములు చరిత్రయే! మన ఋషులకు చరిత్ర జ్ఞానము లేదనుట, మన పూర్వ నాగరకతను ఎంత తక్కువ పరచినచో వారి యేలుబడి అంత గొప్పగా సాగునని, పాశ్చాత్యులు పన్ని పన్నుగడ!
ఈ రచనాకాలం ఏనాటిదైనా, ఈ రోజుకి కూడా భారతీయులమందరము పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మన మూలాలని విసర్జిస్తున్నాము. మంచి-పురోగమనదాయములు గ్రహించుట నాకు నిరభ్యంతరములు, గానీ స్వనింద-పరస్తుతి వైఖరి విపరీతముగా ప్రబలుతోంది. విశ్వనాధ వారు ఇదే విషయాన్ని చాల చక్కగా పురాణ వైర గ్రంధ మాలలో వాడుకున్నారు. పాశ్చాత్యులు మనకు చెప్పిన తప్పుడు పురాణాలకు ఇది వైరమన్న మాట! ఈ విషయాన్ని సూటి గా ప్రస్తావించక, కధ జరిగిన కాలము, ప్రదేశము వంటి విషయాల్లో చెప్పడం జరిగింది. ఉదాహరణకు జనమేజయుడు అ పక్కనే ఎక్కడో రాజ్యం చేస్తున్నడనీ, భగవద్గీత అను కొత్త గ్రంధం వెలువడిందనీ, పాత్రల చేత చెప్పిస్తూ, భారత యుద్ధం జరిగిందన్న రచయిత నమ్మకాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది. నాకీ అంశం మరి చాలా బాగా నచ్చింది!
15.1.11
సంక్రాంతి కబుర్లు

శరీర నిర్మాణానికీ, పోషణ కు ఆహారం ఎంత ప్రధానమో, మన మానసిక అరోగ్యానికి కూడా అలాగే ఆహారం ఎంతో ప్రధానమైనది. తినే తిండిని బట్టి మనసు సత్త్వ-రజో-తమో గుణ స్థితులను పొందుతుంటుంది. దీనికి శాస్త్రీయ నిరూపణలు కూడా కలవు. అటువంటి ఆహారం మన చేతికి అంది వచ్చే రోజు ఈ సంక్రాంతి..నా అధ్యాత్మిక ధోరణి ఇక్కడ అప్రస్తుతం...అంటే నే అనదల్చుకున్నది..ధాన్యం వస్తుందనమాట!!! నిజంగా రైతులకు, మనందరికీ పండుగే. ఎంతో ఆనందగా చేసుకునే వేడుక! భోగి మంటలతో చలి కాచుకోవడం, చంటి పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ముగ్గులు, ముఖ్యంగా మన మెలిక ముగ్గులు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు....అబ్బా..ఈ సారి ఈ హడావిడంతా హైదరాబాదు లో ఉండిపోయి తగ్గింది గాని, పరవాలేదు..నిన్న ఒక బొమ్మలకొలువు పేరంటానికి వెళ్ళాను..దానితో సరి పెట్టుకుంటాను. ఇంకా గంగిరెద్దులు-సన్నాయి మేళమైతే ఈ సారి నా చుట్టుపక్కల ఉండే మాటేలేదు. చిన్నప్పుడు ఆవు పేడ తో అలికి, ముగ్గేసి, గొబ్బిళ్ళు పెట్టి....
సుబ్బి గొబ్బెమ్మ..సుబ్బణ్ణివ్వవే...
చామంతి పూవంటీ చెల్లెల్నివ్వవే...
తామర పూవంటీ తమ్ముణ్ణివ్వవే..
మొగలీ పూవంటీ మొగుణ్ణివ్వవే...


హా..హా అంటూ పాడటం ఇంకా కళ్ళల్లోనే ఉంది.. మా దివ్య, లక్ష్మి, రాంపండు, విజ్జి, విస్సు, సుర్యావతి, శసి...వీళ్ళందరూ నా పేరంటాళ్ళు...ఇప్పుడు కొందరైతే చంటి పిల్లల తల్లులు! బహుశా..గొబ్బిళ్ళాడటం పోయి, పిల్లలికి భోగి పళ్ళు పోస్తుంటారు! అయితేనేం చిన్నప్పుడు బాగ చేసుకునే వాళ్ళం ఈ పండుగ. హైదరబాదు వచ్చేవరకూ గాలి పటాలు ఎగరేస్తారని మాత్రం తెలియదు. ఇది కూడా బాగుంది. చిన్నప్పటి బొమ్మలకొలువులు గుర్తుచేసుకుంటూ ఉన్నా....ఇక ఏం బ్లాగినా చాంతాడంతవుతుంది!
మర్చిపోయాను..ఈ రోజు తిథుల ప్రకారం స్వామి వివేకానంద జన్మదినం. వారికి నా జోతలు....మీ అందరికీ, మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!
5.12.10
మాయా బజారు నాకెంతిష్టమో, 50 సార్ల పైన చూశా!
అభిమన్యుని పెళ్ళి జరిగిందని మనకు తెలుసు గాని, ఎలా జరిగిందో తెలియదు. ఎప్పుడూ, ఎక్కడా పెద్దవాళ్ళు కూడా ప్రస్తావించటం వినలేదు. ఇతిహాస గాధ కు అద్భుత కల్పన జోడించి వెండితెర పై మాయాబజారు అనే ఇంద్రజాలాన్ని ఆవిష్కరించారు ఈ చిత్ర బ్రుందం వారు. ఈ కధ తెలుగు వారికి ఎంత చేరువైనదో నేను ప్రత్యేకించి చెప్పక్కరలేదు. కధా బలం, సంభషణా చాతుర్యం, హాస్యం, కల్పన, సంగీతం, చాయాగ్రహణం, నటీనటుల ప్రతిభ,ఇలా ప్రతీ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారే అందరు, అందువలనే ఈ రోజుకీ ఈ చిత్రానికి ఇంత ఆదరణ. అసలు ఈ చిత్రం గురించి ప్రస్తావించాలంటే ఎక్కడనించి మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు.
కధారంభంలో ముఖ్యమైన పాత్రలను పరిచయం చేసి, శశి- అభిమన్యుల స్నేహం, శౌర్యం, వారి పెళ్ళి మాటలు చూపిస్తారు. కాలం గడిచి శశి- అభిమన్యులు ఒకరికొకరు ఎదురు పడటం చాలా బాగుంటుంది. ఈ సన్నివేశం ఊహించి, తెర పైన ఆవిష్కరించిన రీతి అద్భుతం.
కంప్యూటరంటే తెలియని రోజుల్లో, ప్రియదర్శిని అన్న పేటిక లో ఇష్టమైన వారిని చూడవచ్చు అనే కల్పన ద్వారా నాగేశ్వర రావు( అభిమన్యుడు), సావిత్రి (శశీ) యుగళ గీతం పాడేస్తారు ( నీవేనా నను పిలచినది....నీవేనా నను తలచినది.. నీవేనా నా మదిలో నిలచీ హ్రుదయము కలవర పరచినది, నీవేనా,,,). దానితో పాటూ, బలరాముడు-రేవతి పాత్రల వ్యక్తిత్వం మనకు చెప్పడం జరిగింది. ఆహా పాటా పాడేసుకున్నాం కదా పెళ్ళాడేద్దమనుకోగానే, పాండవులు రాజ్యం పోయి, సుభద్ర కొడుకుతో సహా పుట్టిల్లు, ద్వారక చేరుకుంటారు. ఈంకేముంది రాజ్యహీనులకి కూతుర్నివ్వడం ఇష్టం లేక రేవతి, సుభద్రతో సరిగ్గా ఉండదు. ఇంతలో, బలరాముడు, సుయోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుని తో శశి పెళ్ళి కుదుర్చుకొస్తాడు. ఈ సంఘటనలతో శశి మనస్తాపం చెంది, క్రుష్ణుడి సాయమైనా అందుతుందేమోని అనుకుంటుంది. పెద్దవారు శశిని తన బావను కలవద్దొని ఆంక్షలు పెడతారు. వారి మాటలు గాలికొదిలేసి, లాహిరి లాహిరి..లాహిరిలో.. అంటూ ఒక మాంచి పాట కూడా పాడేసుకుంటారు.
ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది, ప్రధాన జంటలైన శశి- అభి; రుక్మిణి- క్రుష్ణుడు; రేవతి-బలరాములూ అందరూ ఒకరి తర్వాత ఒకరు, నౌకా యానం చేస్తూ ఈ పాట పాడేసుకుంటారు. సుభద్రాభిమన్యులకీ, బలరామరేవతులకీ వాగ్వివాదం జరగి, క్రుష్ణుడు సుభద్రాభిమన్యులను అడవికి పంపేయటం తో అసలు కధ కు తెరలేస్తుంది. మన అసలు నాయకుడు కాదు..కాదు, మన అసలు నాయకుడి పాత్ర ప్రవేశిస్తుంది. అదే ఘటోత్కచుడి పాత్ర. మన యస్వీ. రంగారావు!! ఇక్కడ నాయకుడి పాత్ర అని నేను అనడానికి కారణం ఈ కధలో నాయకుడి పాత్ర ఘటోత్కచుడైనా, నాయకుడు మాత్రం సావిత్రి!!ఘటోత్కచుడి రాజ్యం, అతని మంత్రులు, మంత్రిగారి శిష్యులైన లంబూ-జంబూ పాత్రలు మనని కడుపుబ్బ నవ్విస్తాయి. అసమదీయులు, తసమదీయులు, దుషట చతుషటయం, అనే లంబూ-జంబూల పలుకులు భలే ఉంటాయి. ఇంత కధలో మంచి పాట కూడా వస్తుంది ( భళి భళి భళి భళి దేవా...బాగున్నదయా నీ మాయా...) పరులెవరో తన రాజ్యం లోకి ప్రవేశిస్తున్నరని, ఘటోత్కచుడు, అభిమన్యుడి మీద దండెత్తుతాడు, సోదరులని తెలిసి సంతోషిస్తారు. సుభద్ర-హిడింబి (సూర్యకాంతం) కూడా ఆనందిస్తారు.
ఇహ ఇక్కడినించి అసలు మాయాబజారు స్రుష్టి కి బీజం పడుతుంది. శ్రీ క్రుష్ణుడు సూత్రధారి గా ఈ కధను నడిపిస్తాడు. అందులో భాగంగా అసలు శశి ని మాయం చేసి, ఘటోత్కచుడు మాయా శశిగా మారి ద్వారక లో ప్రవేశిస్తాడు. అంటే తెర మీద ఘటోత్కచుడుగా మనకు కనపడేది మాత్రం సావిత్రి!!!! ఈ మాయ శశి, మనది సోదర ప్రేమ అంటూ అభిమన్యుడిని ఏడిపించడం భలే బాగుంటుంది. ద్వారక చేరిన ఘటోత్కచుడి గర్వ భంగం అద్భుతమైన హాస్యంతో కూడుకున్నది, శ్రీ క్రుష్ణుడు ముసలి తాతగా మారి "చిన చేప ను పెద చేప.....చిన మాయ ను పెను మాయ..." అంటూ ముప్పు తిప్పలు పెడతాడు!ఘటోత్కచుడి మంత్రి శిష్యులతో కలిసి మాయాబజారు స్రుష్టించేస్తాడు. పెళ్ళి వారు హస్తినాపురం నుండి తరలి వస్తారు, లక్ష్మణ కుమారుడి బ్రుందం శకుని మాట మేరకు, పెళ్ళి వారిని ప్రతిదానికీ తప్పు పట్టాలని, కంబళి కాదు, గింబళి ; తల్పం కాదు, గిల్పం తెమ్మని ఇబ్బంది పెట్టినా, ఆడ పెళ్ళి పెద్దలైన లంబు-జంబులు , అన్నీ ఇస్తారు. ఒక సారి మొత్తం పెళ్ళీ వారికి సరిపడ వంటను మన ఘటోత్కచుడు వివాహ భోజనంబు...హహహా..అంటూ పాడుతూ మరీ లాగించేస్తాడు, చూసినప్పుడల్లా, నాకు లొట్టలు వేయడమే మిగిలేది!!!
ఘటోత్కచుడు అంతా తినేశాకా, అక్కడ ఖాళీ గిన్నెలు చూసి, శాస్త్రి-శర్మలు, శకునికి ఫిర్యాదు చేసి మరి పాకశాలకు తీసుకొస్తారు, కాని ఈ లోగానే, రాక్షస మాయ చేత, మళ్ళీ వంటలు స్రుష్టించేస్తారు! ఇంకేముంది శకుని వాళ్ళను చెడా మడా తిడతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే, కధను మన తెలుగు వారికి ఎంత దగ్గరగా తీసుకొచ్చారంటే, పెళ్ళి వంటకాలలో మన తెలుగు వంటలు కనపడతాయి, అంతే కాక, గోంగూర పచ్చడి లేనిదే, వంట సంపూర్ణం కాదని మగపెళ్ళి వారు అంటారు. ద్వారక ఏదో మన ఆంధ్రప్రదేష్ లోనిదే అన్నట్టూ, క్రుష్ణుడు వాళ్ళూ మన తెలుగు వాళ్ళన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే!!!అన్నట్టు మరిచాను, లంబు- జంబులు అంతమంది జనాన్ని చూసి "నర మాంసం..." అంటూ లొట్టలేయడం, వాళ్ళ గురువు వారించడం భలే నవ్వొస్తుంది. ఇంతలో సుయోధన చక్రవర్తి పట్టపు రాణి భానుమతి దేవి, కొడలికి కానుకలు ఇస్తుంది, మాయ శశి, వాటికి ముట్టుకున్నంత మాత్రానే అవి విరిగిపోతాయి, ఇవి నాకన్నా నాజూకు గా వున్నాయి అంటూ అనేసి, లక్ష్మణ కుమారుని భరతం పట్టడానికి వెళ్తుంది మాయా శశి, లక్ష్మణ కుమారుడు కూడా మరదలి అందం చూసి,
సుందరి నీ వంటి దివ్య స్వరూపము...అంటూ పాడి , ఆడగానే చేతులు అ తుక్కుపోతాయి, శశి పారిపోతుంది! శశి పెళ్ళికి తయారవుతూ, ఆహ నా పెళ్ళి అంట.... అంటూ ఒక అద్భుతమయిన పాట వస్తుంది...ఈ పాట లో సావిత్రి తన సినీ జీవితం మొత్తంలోకీ అత్యద్భుత నటన ప్రదర్శించిందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇహ ఆఖరి ఘట్టం లో ఒకే ముహూర్తానికి, శశి-అభిమన్యు; మాయా శశి-లక్ష్మణ కుమారుడి వివాహాలు మొదలవుతాయి. ఘటోత్కచుడు తన మాయ చేత లక్ష్మణ కుమారునికి భ్రమలు కల్పించి పిచ్చి వాడిలా చిత్రీకరించి, పెళ్ళిని కాస్తా గందర గోళం చేసి, దుష్ట చతుష్టయమైన సుయోదహన-దుశ్శాసన-కర్ణ-శకునులను ద్వరక అవతల పడేస్తాడు. అసలు శశి-అభి తమ కుటుంబాన్ని కలవడం తో కధ సుఖాంతమవుతుంది. శ్రీ క్రుష్ణుడి విశ్వ రూప దర్శనానికి, ఘటోత్కచుడు పరవశించి స్తుతించడం తో శుభం!!!! అన్నింటికన్నా ముఖ్యమైనది, కధలో పాండవులను చూపించకుండా, ప్రస్తావన చేత మాత్రం వారు ఉన్నట్టే అనిపించేట్టు, కధ నడిపించడం నిజంగా దర్శకుని ప్రతిభకు నిదర్శనం!!! ఈ సినిమాలోని పాటలన్నీ బాగుంటాయి, భస్మాసుర వంటి న్రుత్య రూపకాలు కూడా అలరిస్తాయి!కధ చెప్పేశా, మరి ఈ కధ వెనుక వారి గురించి ఇప్పుడు చెపుతా....సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు. మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి.
ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి.ఈ చిత్రానికి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా నియమితులయ్యారు. 4 యుగళగీతాలకు స్వర కల్పన చేసాక, కారణాంతరాల వలన ఆయన తప్పుకోగా సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకు వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసారు ఘంటసాల. ఘంటసాల , పి.లీల , పి.సుశీల , మాధవపెద్ది సత్యం మొదలగు వారి నేపధ్య గానంలో వచ్చిన , నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ, సుందరి నీవంటి, ఆహ నా పెళ్ళీ అంటా, వివాహభోజనంబు వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి. ఆలాగే లాహిరి లాహిరి లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు (ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ , గుమ్మడి) ఘంటసాల పాడటం ఒక ప్రత్యేక విశేషం.ఇక స్క్రిప్టు మనల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్లూ మనల్ని రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని. మచ్చుకు కొన్ని:

* అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కొండ మీద దూకగానే ఆ అదటుకు కొండకొమ్ము విరిగి పడడమూ,
* మాయామహల్లో కంబళి లా కనిపించే గింబళి తనంతట తనే లోపలికి చుట్టుకోవడం,
* తల్పం లాంటి గిల్పం గిరగిరా తిరిగి క్రిందపడదోయడం లాంటి విడ్డూరాలు,
* ఘటోత్కచుడి "వివాహభోజనం"బు షాట్లు
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ సినిమాలో నటించిన కొందరు కళాకారులు

కృష్ణుడు : ఎన్.టి.ఆర్ :అంతకు ముందు ఒక సినిమాలో వేసిన కృష్ణుని పాత్రకు మంచి స్పందన రాలేదు. కనుక ఈ సినిమాలో చాలా జాగ్రత్త తీసుకొని ఎన్.టి.ఆర్.కు ఈ పాత్ర, మేకప్ రూప కల్పన చేశారు. తరువాత కధ ఎవరికి తెలియదు?
అభిమన్యుడు :ఏ.ఎన్.ఆర్
శశిరేఖ:సావిత్రి
ఘటోత్కచుడు:ఎస్.వి.రంగారావు:ఈ సినిమాలో పాత్ర చిత్రీకరణ వల్ల తెలుగువారికి ఘటోత్కచుడు చాలా ప్రియమైన వ్యక్తి ఐపోయాడు.
లక్ష్మణ కుమారుడు:రేలంగి:లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కధలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. కాని ఇది "మాయ" బజార్ కదా?
చిన్నమయ:రమణా రెడ్డి
బలరాముడు:గుమ్మడి వెంకటేశ్వరరావు
శకుని:సి.ఎస్.ఆర్
రేవతీ దేవి: ఛాయా దేవి
సుభద్ర:ఋష్యేంద్రమణి
రుక్మిణి:సంధ్య
సాత్యకి:నాగభూషణం
కర్ణుడు:మిక్కిలినేని
దుశ్శాసనుడు:ఆర్.నాగేశ్వరరావు
లంబు:చదలవాడ కుటుంబరావు
జంబు:నాల్ల రామ్మూర్తి
కృష్ణుడు మాయా రూపంలో ఉండి అటు నేనే ఇటు నేనే పాట పాడే పాత్రధారి: కంచి నరసింహారావు
శర్మ:అల్లు రామలింగయ్య
దారుకుడు: మాధవపెద్ది సత్యం
శాస్త్రి: వంగర వెంకటసుబ్బయ్య
హిడింబి : సూర్యకాంతం
మాయలు
* అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే. కానీ ఒక్క చోట ద్రౌపది లీలగా కనిపిస్తుంది (విన్నావటమ్మా, ఓ యశోదా పాట చివరిలో)

* "అహ నా పెళ్ళంట.." పాటలో తధోంధోంధోం తధీంధీంధీం అనే బిట్ ని పాడింది మాధవపెద్ది సత్యం కాదు. ఘంటసాల.
* "దురహంకార మదాంధులై.." అనే పద్యానికి ముందు వచ్చే "విన్నాను మాతా విన్నాను.." అనే సుదీర్ఘమైన డైలాగ్ ను పలికింది రంగారావు, మాధవపెద్ది సత్యం కాదు.
* ఆశ్చర్యం: ఈ సినిమాలో కర్ణుడికి అసలు కవచ కుండలాలే లేవు.
* ఈ చిత్రంలో ప్రముఖ నేపథ్య గాయకులు మాధవపెద్ది సత్యం , భళి భళి భళి భళి దేవా గీతంలో రథసారథి పాత్రలో కనిపించి మనల్ని అలరిస్తారు.
ఈ సినిమాలో హిట్టయిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు అసలు సంగీత దర్శకుడు.
(చూపులు కలసిన శుభవేళా, నీవేనా నను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది) కానీ చక్రపాణితో వచ్చిన విభేదాలవలన సాలూరు తప్పుకొనగా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల అందించాడు. అయితే సినిమా టైటిల్స్‌లో సాలూరు రాజేశ్వరరావు పేరు చూపలేదు.పాట / పద్యం: గీతరచన : నేపథ్యగానము
నీవేనా నను తలచినది: పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
లాహిరి లాహిరి లాహిరిలో: పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.లీల
వివాహ భోజనంబు : పింగళి : మాధవపెద్ది సత్యం
అహ నా పెళ్ళియంట : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, సుశీల
భళి భళి భళి దేవా : పింగళి : మాధవపెద్ది సత్యం
చూపులు కలసిన : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.లీల

నీకోసమె నే జీవించునది : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
సుందరి నీవంటి దివ్య : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, సావిత్రి
దయచేయండి : పింగళి : ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల,సుశీల,మాధవపెద్ది సత్యం
విన్నావటమ్మాయశోద : పింగళి : పి.లీల,సుశీల,స్వర్ణలత
వర్ధిల్లు మా తల్లి : పింగళి : ఎమ్.ఎల్.వసంతకుమారి
అఖిల రాక్షస (పద్యం) : పింగళి : ఋష్యెంద్రమణి
అల్లి బిల్లి ఆటలె : పింగళి : సుశీల
అష్టదిక్కుంభి (పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
దురహంకార(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
శకునియున్న(పద్యం) : పింగళి : సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
శ్రీకరులు దేవతలు : పింగళి : బృందగానం
స్వాతిశయమున(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
జై సత్య సంకల్ప జై
శేషతల్పా(పద్యం) : పింగళి : మాధవపెద్ది సత్యం
ఈ సినిమాకు ఈ మధ్య కాలం లో రంగులద్దరు కూడా!!!
నలుపు తెలుపులో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్‌స్టోన్ అనే సంస్థ 2010 జనవరి 30 న రంగుల్లో విడుదల చేశారు. మాయాబజార్ పాత ఫిల్ములో సౌండ్ ట్రాక్‌లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు. అందుకని మూలం చెడకుండా నేపథ్య సంగీతం మొత్తం రీరికార్డింగ్ చేశారు. దాని తర్వాత సినిమాను 70 ఎం.ఎం కి మార్చి డీటీఎస్ కి మార్చారు. ఇందుకోసం 165 మంది నిపుణులు దాదాపు ఏడాది సమయం పాటు పనిచేశారు!!!!!!ఇహ శెలవు !!నమో క్రిష్ణ!!!నమో క్రిష్ణ!!!!!నమో...నమో!!22.11.10
మైదానం ఎందుకు??
చలం, ఈ పేరు వినగానే గుర్తొచ్చేది "మైదానం". విప్లవ రచనలు చేసిన వారు ఎందరు ఉన్నా, స్త్రీవాదం అనగానే స్ఫురించేది గురజాడ, కందుకూరి, చలం. స్త్రీవాదం లో చలానిదొక ప్రత్యేక శైలి. మిగతా వారు సమాజం లో ఉన్న దురాచారలను దుయ్యబట్టినా, కుటుంబ, సమాజ నియమోల్లంఘన కావించక, ఆడది తన కష్టాల నుండి వేరొకరి సహయం తో ఎలా బయట పడిందో సున్నితంగా, వ్యంగ్యంగా చెప్పటం చేశారు. అయితే చలం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా మైదానం లో రాజేశ్వరి పాత్రను చిత్రీకరించారు. రాజేశ్వరిది ప్రేమరాహిత్యాన్ని అనుభవించే పాత్ర. భర్త దగ్గర తాను పొందలేని ప్రేమను వేరొకరి దగ్గర వెతుక్కుంటూ, సమాజపు కట్టుబాట్లను ఎదిరిస్తుంది రాజేశ్వరి. బుద్ధిని ఉపయోగించక, కేవలం మనసు మాట వింటూ, తాను తీసుకున్న నిర్ణయాలకు ఎలా బలయి పోయిందన్నది కధాంశం. స్త్రీవాదం కంటే కూడా నాకు ఈ నవల లో విచ్చలవిడితనం, నియమోల్లంఘన అధికంగా స్ఫురించాయి. కథ లో అంతర్లీనంగా కట్టుబాట్లను కాదంటే ఎదురయ్యే కష్టాల గురించి ఉన్నా, రాజేశ్వరి మానసిక సంఘర్షణను అద్భుతంగా వర్ణించినా, పాఠకుల ద్రుష్టి ఆ అంశం పైన పడటం కష్టం. రాజేశ్వరి భర్తను విడిచి పెట్టి పరాయి వాడితో వెళ్ళిపోవడం, తరువాత అతడు ఆమెని అవసరాలకు వాడుకొని వదిలేయడం, ఈ క్రమంలో ఇంకో మగాడు పరిచయమవటం.... ఇలా రాజేశ్వరి జీవిత పయనం గమ్యం లేనిదై, కోరుకున్న ప్రేమ దొరకక, హత్యా కాండ లో అంతమై, చివరికి న్యాయస్థానం లో నిలబడుతుంది. ఖచ్చితంగా ఈ కథ లో , నియమోల్లంఘన వల్ల వచ్చే నష్టాల కన్నా కూడా బరితెగించడం అన్న అంశం మీదనే పాఠకుల ద్రుష్టి పోతుంది. ఈ రచన ద్వారా చలం సమాజానికి ఏం చెప్పదలచుకున్నదీ నాకైతే అర్ధం కాలేదు!!!
1.11.10
జై తెలుగు తల్లి!
భారతదేశ0 లోనే ప్రప్రధమంగా భాషను ఆధారంగా చేసుకుని అవతరించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పొట్టి శ్రీరాములు గారి మరణం మన తెలుగు వారి అస్థిత్వాన్ని కాపాడిందనే చెప్పాలి. ఆయన మరణించాకా దాదాపు ఏడాదికి గానీ ఆంధ్రా పుట్టలేదు.15 డిసెంబరు 1952న పొట్టి శ్రీ రాములు అమరులయ్యారు.నవంబరు 1, 1953 లో ఆంధ్ర రాష్ట్రం పుడితే, తెలంగాణాను కలుపుకుని సంపూర్ణం గా తెలుగు వారితో కూడిన రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది మాత్రం నవంబరు 1, 1956 లో. మన యావత్తెలుగు జాతి కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని, మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి!
మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లి మీ కోసం ..

మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......
ఈ పాట శంకరంబండి సుందరాచారి, దీనబంధు అనే చలన చిత్రం కోసం 1942 లో లిఖించగా, టంగుటూరి సూర్య కుమారి ఆలపించారు. ఈ మధ్యనే ఈ పాటను శేఖర్ కమ్ముల "లీడర్" అనే చలనచిత్రంలో వాడుకున్నారు.
మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లి మీ కోసం ..

మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......
ఈ పాట శంకరంబండి సుందరాచారి, దీనబంధు అనే చలన చిత్రం కోసం 1942 లో లిఖించగా, టంగుటూరి సూర్య కుమారి ఆలపించారు. ఈ మధ్యనే ఈ పాటను శేఖర్ కమ్ముల "లీడర్" అనే చలనచిత్రంలో వాడుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)