అనుచరులు

26.12.12

తెలుగుజాతి మనది

తెలుగు మహాసభల పుణ్యాన తెలుగు వార్తాపత్రికల్లో తెలుగు భాష గురించి రాస్తున్నారు. లేకపోతే వాళ్ళకు మాత్రమేం ఖర్మ! తెలుగు మహా సభలు జరగడం తెలంగాణకు అన్యాయ అనడం నవ్వొస్తోంది! తెలంగాణ వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగే కదా! అయితే వారిది తెలంగాణ మాండలికంగా పిలుస్తారు.ఇక పొతే గద్దర్ వంటి తెలంగాణ కవులకి స్థానం కల్పించడం విషయమైతే, ప్రస్తుతం రగులుతున్న తెలంగాణ పోరాట నేపధ్యం లో పోరాటాన్నీ,భాషోద్యమాన్నీ వేరు చేసి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. గద్దర్ వంటి వారు కవుల కంటే కూడా ఉద్యమకారులుగా గుర్తింపు పొందారు! కాబట్టి ఇటువంటి విషయాలను పెద్దవి చేయడం అనవసరం. ఆ మాటకోస్తే, తెలుగు వారికి మొట్టమొదటి  జ్ఞానపీఠ్ పురస్కారం సాధించి పెట్టిన విశ్వనాథ సత్యనారయణ గారికి, ఆయన  సాహిత్యసంపదకే ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వట్లేదు. దాన్ని పట్టించుకునే నాధుడేడి? ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగే వాడాలి అంటున్నరు, దాని వల్ల ఎవరికి ఉపయోగం? రకరకాల వారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల మీద వస్తారు, తెలుగు రాని వారు ఉండచ్చు. వారికెంత ఇబ్బంది? తెలుగు భాషను అందరూ నేర్చుకునే చర్యలూ, తెలుగు  సాహితీ ప్రక్రియలకు ప్రాచుర్యం కల్పిస్తే చాలదా!తెలుగు భాషను కోస్తా, సీమ, తెలంగాణ మాండలికాల్లో, ఎలా మాట్లాడే వారైనా మాత్రుభాషను ప్రేమించండి, తరువాతి తరాలకు నేర్పించండి.   మనది తెలుగుజాతని గర్వపడండి.