అనుచరులు

4.7.13

మొల్ల (కవులకధలు)-రెండవ భాగము



మొల్ల కవితాపటిమను విన్న రాయలు వారు ఆమెను భువనవిజయానికి ఆహ్వానించారు. అష్టదిగ్గజ కవుల సమక్షంలో ఆమె రాయలవారికి తను రచించిన రామాయణంలోని పద్యాలు చదివి వినిపించింది.కానీ సభలో వారు మొల్ల ఆశుకవితా సామర్ధ్యాన్ని పరిక్షించాలనుకున్నారు.
 ఇంకేముంది! రామలింగడు," గుమ్ము,బుస్సు,రింగు,బొణుగు" అనే మాటలు వాడి  గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చెప్పమన్నారు.ఇంకా, విష్ణువు దూరము నుండే గజరాజునకు ధైర్యము చెప్పి, అభయం పలికినట్లు పద్యము లో ఒక్కసారే ఉండాలి.ఈ నియమాలు పాటిస్తూ మొల్ల చక్కటి ఈ పద్యాన్ని చెప్పింది:

అనిలాభిహత దక్షిణా వర్త శంఖంబు గుంఫి తంబై కేలగుమ్ము రనగ 
గొడుగై తరచుగ బడగలొక్కెడదట్టి భుజగాధిపతి మీద బుస్సరనగ  
చఱచి నిబ్బరముగా బఱతెంచు ఖగరాజు ఱెక్కగాడ్పులు మింట ఱింగు రనగ
దొంతి బ్రహ్మాండపంక్తులు బొజ్జలోనుండి బెణకియొక్కొకమాఱు బొణుగు రనగ
                                                                -అనుకరణమున రేఫాగమము
 కూకకనుచూపుమేరకు గోకవిసరి వెఱకు!వెఱవకు! వెఱవ!కనుచు
నుద్దవడివచ్చి గజరాజునొద్దవ్రాలె నార్తరక్షణచణుడు నారాయణుండు. 
  
అత్యంత మనోహరమైన ఈ పద్యం విన్నవారంతా మొల్లను మెచ్చుకున్నారు.ఈ విధంగా మొల్ల రాయలవారినీ, ఆతని అష్టదిగ్గజ కవులని కూడా మెప్పించింది.  
                                                               
                                                                సమాప్తం