అనుచరులు

29.8.13

అసమర్థుని జీవయాత్ర

చాలా రోజుల తరువాత తెలుగు నవల చదవాలనిపించి, పుస్తకం కోసం వెతుకుతుంటే అసమర్థుని జీవయాత్ర అనే ఈ నవల గురించి తెలిసింది.త్రిపురనేని గోపీచంద్ రాసిందీ నవల.ఈ పుస్తకం చదివాకా నాకు పుట్టుకొచ్చిన చిరాకు అంతా ఇంతా కాదు!ఈ కధాంశం నుండి పాఠకులేం తెలుసుకోవాలని రచయిత కోరుకున్నాడో నాకర్ధం కాలేదు.సీతారామారావు ఈ నవలలో కధానాయకుడు! కాదు కాదు కధానయకుడనడానికి లేదు, ముఖ్య పాత్ర!
వీడంత వెధవ ఇంకోడు ఈ భూమి మీద ఎక్కడా పుట్టి ఉండడు,పుట్టడు (కనీసం ఊహల్లో కూడా పుట్టడు!)అని మొదటి నాలుగైదు కాగితాలు తిరగేస్తేనే అర్థమైపోతుంది.వీడికి మనుషులు నచ్చరు,కుటుంబ వ్యవస్థ నచ్చదు,తల్లిదండ్రులు,అత్తమామలు,భార్యాబిడ్డలు,ఇలా ఏ మానవసంబంధాలూ ఇష్టముండవు.వీడికి పెళ్ళి వద్దట!కానీ ఇంట్లో వాళ్ళను కాదనలేక పెళ్ళాడతాడు.మరి ఇంత పెళ్ళి ఇష్టం లేని వాడూ పెళ్ళం తోనే ఉంటాడు, పిల్లల్ని కంటాడు. కానీ వీడికి ఎవరన్నా ఇష్టం లేదు!వాడి నిరాశానిస్ప్రుహల్లో వాడుంటాడు, చివరికి చాలా క్రూరంగా ఆత్మహత్య చేసుకుని చస్తాడు.అదీ స్మశానంలో ఆత్మహత్య!

అసమర్థులూ,నిరాశావాదులూ,తమ ఈ అశక్తతను అధగమించడం ఎలాగో చెప్పడం మానేసి,ఒక విషాదభరిత,విషపూరిత కధాంశాన్ని పాఠకులకు అందించడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటో??  

6 కామెంట్‌లు:

jaya చెప్పారు...

ఒకే మూస నవలలు వస్తున్న సమయంలో గోపీచంద్ వ్రాసిన అద్భుత నవల ఇది... ఇది, దీని నాయకుడు మీకు నచ్చకపోవచ్చు. సమాజంలో ఇటువంటివారు ఎందరో ఉన్నారు..

అజ్ఞాత చెప్పారు...

నచ్చినవి చెపుతానని నచ్చనివి కూడా చెపున్నారేంటండీ మీరు?

అజ్ఞాత చెప్పారు...

ilanti manshulu vunnaru....

nenu chusa....

madyatharagathi kutumballo chaala

mandi vunnaru......

sharma చెప్పారు...

ఇందులో సీతారామారావు ఒక ఉన్నత భావాలు కలిగిన సోమరి, తన చుట్టూ ప్రపంచం ఎంతో గొప్పగా ఆదర్శంగా ఉండాలనుకుంటాడు, కాని అతను మాత్రం అలా ఉండడు. నిశితంగా చూస్తే ఈ సమాజం లో చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నేను చాలా రోజుల క్రితం ఈ నవల చదివాను, అంతా కాదు గాని కొన్ని చోట్ల నేను identify అయ్యాను, ఆ కొన్ని ఎంటంటె ప్రపంచం అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోడమే తప్ప నేనెలా ఉంటున్నానసలు అన్నది పెద్దగ పట్టించుకునే వాడిని కాదు. కాని కొన్ని విషయాలు చదువుతుంతే నన్ను తట్టి లేపినట్టైంది, వ్యక్తిత్వం అంటే ఇలా ఉండకూడదు అనిపించింది. ఇంకొక విషయం ఇందులొ సీతారామారావు తండ్రి గొప్ప కోసం పేరు కోసం చేసిన పనులు, అవి పొందిన వాళ్ళ పొగడ్తలు సీతారామరావు విని గొప్పగా ఫీలవడం ఇలాంటి వ్యక్తులను నేను చూసాను. ఇహ చివర్లో చనిపోవడం గురించి అంటారా.. ఒక సోమరి జీవన శైలి ఇంతకన్నా గొప్పగ ఉంటుందని నాకు అనిపించలేదు, ఎదో నిజం గా జరిగినట్టు అలా సాగిపోతుంది, ఇలా ఉండాలి అని ముగిస్తే అది సినిమాటిక్ గా ఉంటుందేమో...

అజ్ఞాత చెప్పారు...

పైన శర్మ గారి అభిప్రాయమే నాది ను .
ఈ నవల నేను పూర్తిగా చదవలేకపోయాను మొదటి సారి , కొన్ని కొన్ని సార్లు నన్ను నేనే చదువుకుంటున్నట్టు అనిపించేది .
అలా అనిపించినప్పుడల్లా పుస్తకం పక్కన పెట్టేసేవాడిని . కాని ఆ ఆలోచనాలు మాత్రం వదిలేవి కాదు .
నవలలో సీతారామారావు కున్న లక్షణాలు అన్నీ ఒక్కరికే ఉండకపోవచ్చు , ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటుంది . కొంతమందికి ఎక్కువ లక్షణాలు ఉంటాయి .
అతి మంచితనం
సోమరితనం
గోప్పలకి పొంగిపోవడం
ఏదో సాధించాలన్న ఆలోచనలు తప్ప , చేతలు ఉండకపోవడం .
anyhow, its your blog and your thoughts.
Please remove word verification.

అజ్ఞాత చెప్పారు...

Mirror is a reality check; not a magic wand to make us beautiful.
Not all humans are beautiful and not all problems have solutions.

This book acts like a mirror to many middle age+ people.