అనుచరులు

1.11.10

జై తెలుగు తల్లి!

భారతదేశ0 లోనే ప్రప్రధమంగా భాషను ఆధారంగా చేసుకుని అవతరించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పొట్టి శ్రీరాములు గారి మరణం మన తెలుగు వారి అస్థిత్వాన్ని కాపాడిందనే చెప్పాలి. ఆయన మరణించాకా దాదాపు ఏడాదికి గానీ ఆంధ్రా పుట్టలేదు.15 డిసెంబరు 1952న పొట్టి శ్రీ రాములు అమరులయ్యారు.నవంబరు 1, 1953 లో ఆంధ్ర రాష్ట్రం పుడితే, తెలంగాణాను కలుపుకుని సంపూర్ణం గా తెలుగు వారితో కూడిన రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది మాత్రం నవంబరు 1, 1956 లో. మన యావత్తెలుగు జాతి కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని, మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి!

మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లి మీ కోసం ..


మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......

ఈ పాట శంకరంబండి సుందరాచారి, దీనబంధు అనే చలన చిత్రం కోసం 1942 లో లిఖించగా, టంగుటూరి సూర్య కుమారి ఆలపించారు. ఈ మధ్యనే ఈ పాటను శేఖర్ కమ్ముల "లీడర్" అనే చలనచిత్రంలో వాడుకున్నారు.

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

The first linguistic state in India was Orissa. Andhra (not AP) was the first linguistic state in independant India.

శ్రీ సౌమ్య ఆవంచ చెప్పారు...

స్వతంత్ర భారత దేశంలో భాషాప్రామాణిక రాష్ట్రంగా 1-10-1953న ఆంధ్రరాష్ట్రం ఏర్పడినది.3సంవత్సరాల తరువాత 1-11-1956న తెలంగాణాను కూడా కలుపుకొని ఆంధ్రప్రదేష్ అవతరించింది.చదివి వ్యాఖ్య వ్రాసినందుకు,సవరణ చేసుకునే వీలు కలిపించినందుకు జై గొట్టిముక్కల గారికి ధన్యవాదములు.