తెలుగదేలయన్న,
దేశంబు తెలుగేను
తెలుగు
వల్లభుండ తెలుగొకండ
యెల్ల
నృపులు గొల్వ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
అని పలికినవాడు శ్రీ కృష్ణ దేవరాయలు.
పలికించినవాడు శ్రీకాకుళాంధ్రదేవుడు. మహావిష్ణువు రాయలి వారి కలలో
కనిపించి ఈ పద్యము పలికి,
గోదా కల్యాణము, తెలుగు భాష లో రచించమని
ఆదేశించాడు.
ఈ ఆదేశము ఆయనకు కలిగినది కృష్ణా
జిల్లాలోని శ్రీకాకుళంలో!
శ్రీకృష్ణదేవరాయలు విజయవాడ ఆక్రమించడానికి 1525
వ సంవత్సరంలో వచ్చి
అప్పటికే ఎన్నో వేల సంవత్సరాల
చరిత్ర కలిగిన ఆంధ్రమహావిష్ణువును కొలిచి,
ఏకాదశి వ్రతమాచరించారు.
ఆనాటి రాత్రి కలలోనే
ఆముక్తమాల్యదకు బీజం పడినది.
ఇంత
చారిత్రక ప్రాసస్త్యం గల శ్రీకాకుళం విజయవాడ
నుండి గంటే ప్రయాణం.
మన
చుట్టూ ఉన్న ఎన్నో గొప్ప
ప్రదేశాలను విడిచి యాత్రలకు ఇంకెక్కడికో వెళుతున్నాం.
అందుకే తెలుగు కవితా వైభవాన్ని చాటిచెప్పే
శ్రీకాకుళం,
మొవ్వ,
మోపిదేవి మొదలైన ప్రాంతాలన్నీ చూసివచ్చాను. .
విజయవాడ నుండి పగలు 5
గంటలకు
బయల్దేరితే,
తిరిగి సాయంత్రం 6
గంటలకు విజయవాడకు వచ్చేశాం.
శ్రీకాకుళంలోని
విష్ణువు, ఆంధ్రమహావిష్ణువుగా పిలవబడుతాడు.
ఇక్కడి వైష్ణవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర
ఉంది.
ఆలయంలోని కుడ్యాల అందం వర్ణనాతీతం.
మూలవిరాట్టులో
జీవకళ ఉట్టిపడుతోంది.
స్వామివారి కళ్ళూ,
చేతి వేళ్ళూ
ఎంత సజీవంగా అనిపిస్తాయో.
ఈ మూర్తి రాలి(
కోన సీమ)
లోని మొహిని
అవతారాన్ని పోలి ఉంది.
అక్కడి
విగ్రహం చుట్టూరా దశావతారాలు చెక్కినట్టే,
ఇక్కడా ఉన్నాయి.
గుడి ఆవరణ కూడా
చాల పెద్దది.
ఒకప్పుడు ఈ ఊరు రావాలంటే
పడవ ప్రయాణం తప్పనిసరి.
కాని ఇప్పుడు చక్కటి
రహదారులున్నాయి.
గుళ్ళోని ఆముక్త మాల్యద మండపంలో రాయలవారి విగ్రహముంది.
అలగే రాయలువారు చెక్కించిన
శిలాశాసనాలు ఆలయం మీద చూడవఛ్చు.
చాలా వరుకూ అరిగిపోయి ఉన్నాయి
అక్షరాలు.

ఇంకా దురదృష్టం ఏమంటే హతవిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ మకుటంతో ప్రసిధ్ధమైన ఆంధ్ర శతకం చెక్కబడిన శిలలు పాడుబడిన ఒక పెంకుటింట్లో గుడి వెనుకనున్నాయి.విష్ణువు కృపతో పలికిన సరస్వతి సరైన ఆవాసం లేకుండా ఉండటం బాధాకరం.ప్రభుత్వం తలుచుకుంటే అదేం అంత పెద్ద పని కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి